న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఎబిడిఎం) పథకంపై రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌ను ప్రజలకు అందచేసేందుకు ఒక పబ్లిక్ డాష్‌బోర్డును నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఎ) ప్రారంభించింది. ఈ డాష్‌బోర్డులో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఎబిహెచ్‌ఎ) నంబర్లు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ(హెచ్‌పిఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ(హెచ్‌ఎఫ్‌ఆర్)కు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుందని ఎన్‌హెచ్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. ఎబిహెచ్‌శ్రీలో డాక్టర్లు, నర్సులు తదితర హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ సమాచారం ఉంటుంది. ఎబిహెచ్‌ఎ కింద 22.1 కోట్ల ఐడిలను సృష్టించింది. 16.6 వేలమంది హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ హెచపిఆర్‌లో, 69.4 వేల మంది హెల్త్ ఫెసిలిటీస్ హెచ్‌ఎఫ్‌ఆర్‌లో నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 1.8 లక్షలకు పైగా హెల్త్ రికార్డులను యూజర్లు లింక్ చేయగా, ఎబిహెచ్‌ఎ యాప్ నుంచి 5.1లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ జరిగినట్లు ఎన్‌హెచ్‌ఎ తెలిపింది.
NHA launches Public Dashboard for Ayushman Bharat Digital Mission