- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పుడు పలు ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న టన్నెల్స్ భద్రతపై పరిశీలన జరుగుతుంది. జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) మొత్తం 29 నిర్మాణ దశల టన్నెల్స్ సేఫ్టీ ఆడిట్‌ను చేపడుతుందని బుధవారం అధికార ప్రకటనలో తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలి 41 మంది వరకూ కూలీలు పదిరోజులుగా లోపలనే బందీలుగా ఉండటంతో జాతీయ స్థాయిలో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటిని నిశితంగా తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్ల గురించి విశ్లేషించుకోవాలని నిర్ణయించారు.
- Advertisement -