Wednesday, January 22, 2025

జైలులో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్‌ఐఎ అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సమ్మతి తెలియజేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తుది ఆదేశాలు వెలువరించాల్సి ఉంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ బారాముల్లా నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి, విజయం సాధించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత , మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉండటంతో మిగతావారితోపాటు 18 వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయారు. తన ప్రమాణస్వీకారం కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ రషీద్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో పార్లమెంట్‌కు వచ్చి, ఆప్ నేత సంజయ్‌సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించాలని జులై ఒకటిలోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌ఐఎ కోర్టు ఆదేశించింది. ఈ క్రమం లోనే ఎన్‌ఐఏ తన సమ్మతిని తెలియజేసింది. దీనిపై మంగళవారం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఇదిలా ఉంటే పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అతడు కూడా ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. ప్రస్తుతం అతడు కూడా జైల్లోనే ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News