- Advertisement -
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా మరోసారి ఎన్‌ఐఎ, ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు చేస్తోంది. మూడోసారి పిఎఫ్‌ఐ సంస్థలపై సోదాలు చేపడుతోంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్నాటక, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ముఖ్యనేతల హత్యకు కుట్ర జరిగినట్టు అభియోగాలు వస్తున్నాయి. పాట్నాలో ప్రధాని హత్యకు కుట్ర చేసినట్టు ఎన్‌ఐఎ ఆరోపణ చేస్తుంది. ఆరు నెలల్లోనే పిఎఫ్‌ఐ సంస్థల అకౌంట్లలో రూ.120 కోట్లు జమయ్యాయి. విదేశాల నుంచి పిఎఫ్‌ఐ భారీగా డబ్బులు సేకరించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇడితో కలిసి మరోసారి ఎన్‌ఐఎ సోదాలు చేస్తోంది. పిఎఫ్‌ఐ కార్యాలయాలతో పాటు కార్యకర్తల ఇళ్లలో కూడా ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
- Advertisement -