Thursday, January 23, 2025

బెంగళూరు పేలుడు కేసు..ఇద్దరి జాడ చెపితే రూ 20లక్షల కానుక

- Advertisement -
- Advertisement -

బెంగళూరు బాంబు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) శుక్రవారం ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. వీరి గురించి తగు సమాచారం ఇచ్చినవారికి రూ 20 లక్షల పారితోషికం ప్రకటించింది. ఇద్దరు అనుమానితులు ముసావిర్ హుస్సేన్ , అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలలు ఇప్పుడు నియా వాంటెడ్ జాబితాలో చేరారు. ఈ ఇద్దరు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు కుట్ర పన్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. ఫరారీలో ఉన్న ఈ ఇద్దరి జాడకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇద్దరు నిందితులు 2020 టెర్రరిజం కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నారు. దేశంలో ఎక్కడైనా ఎవరికైనా వీరి గురించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు నేరుగా కానీ ఇన్ఫో ,ఎన్‌ఐఎ @గవ్. ఇన్ ద్వారా కానీ తెలియచేయవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ తమ పేర్లు మార్చుకుని పలు ప్రాంతాలలో తిరుగుతున్నట్లు నిఘా వర్గాలకు తెలిసింది. వీరి పట్టుకుంటే పేలుడు ఉదంతంలోని కీలక విషయాలు మరింతగా వెలుగులోకి వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News