- Advertisement -
చెన్నై: జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఎ) ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ దర్యాప్తులో భాగంగా ఎల్‌టిటిఇ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ సభ్యుడు సద్గుణం అలియాస్ సబేశన్(47)ను మంగళవారం అరెస్టు చేసింది. ప్రస్తుతం అతడు చెన్నైలో నివసిస్తున్నాడు.
లక్షద్వీప్‌లో మార్చి 18 మినికాయ్ గస్తీ దళం, చేపలు పట్టే నావ ‘రవిహంసి’ని అడ్డుకుని ఎకె47 రైఫిళ్లు, వేలాది 9ఎంఎం మందుగుండు సామాగ్రి,300 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ ఈ ఏడాది ఆరుగురు శ్రీలంక జాతీయులకు వ్యతిరేకంగా దర్యాప్తు చేపట్టింది. సబేశన్ భారత్‌లోని ఎల్‌టిటిఇ సానుభూతిపరుల కుట్ర సమావేశాలను కూడా ఏర్పాటు చేసేవాడని ఎన్‌ఐఎ వెల్లడించింది.
- Advertisement -