Wednesday, January 22, 2025

గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆస్తుల జప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులకు నాయకత్వం వహించే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన మూడు రాష్ట్రాల్లోని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శనివారం జప్తు చేసింది. దేశంలో ఆ గ్యాంగ్‌స్టర్ బంధాలను ధ్వంసం చేయడమే లక్షంగా చేపట్టిన చర్యల్లో ఇదో భారీ చర్యగా దర్యాప్తు సంస్థ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లోని మూడు స్థిర, ఒకటి చరాస్తులను ఉపా ( చట్టవిరుద్ధ కార్యక్రమాలను నివారించడం) చట్టం కింద జప్తు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఆస్తులన్నీ ఉగ్రవాద ఆదాయాలనీ , ఉగ్రవాద కుట్రలకు, తీవ్రమైన నేరాలు అమలు చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారని అధికారులు చెప్పారు. లక్నో లోని గొంటినగర్ ఎక్స్‌టెన్షన్ లోని ఫ్లాట్‌తోసహా ఈ ఆస్తులన్నీ జప్తు చేసినట్టు అధికారులు వివరించారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ లోని ఉగ్రవాద గ్యాంగ్‌కు ఆశ్రయం ఇచ్చే వికాస్ సింగ్‌కు చెందినవిగా అధికారులు వివరించారు. పంజాబ్ ఫజిల్కా బిషన్‌పుర గ్రామం లోని మరో రెండు ఆస్తులు జప్తు అయ్యాయని, ఈ ఆస్తులు నిందితుడు దలీప్ కుమార్ అలియాస్ భోలా అలియాస్ దలీప్ బిష్ణోయ్‌కు చెందినవని చెప్పారు. వీటిలో ఎస్‌యువి వాహనం హర్యానా లోని యమునానగర్‌కు చెందిన జోగీందర్‌సింగ్ పేరున రిజిస్టర్ అయిందని అధికారులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News