Thursday, November 21, 2024

తమిళనాడు, హైదరాబాద్‌ల్లో ఉగ్రవాద కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దక్షిణాదిలో ఉగ్రవాదుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఎ) శనివారం భగ్నం చేసింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించి పలువురిని అదుపు లోకి తీసుకుంది. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ నెట్‌వర్క్ బయటపడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, తమిళనాడు లోని చెన్నైలో మూడు చోట్ల, కడైనల్లూరులో ఒక చోట, తెలంగాణ లోని హైదరాబాద్‌లో ఐదు చోట్ల, సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు,

అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితోపాటు రూ. 60 లక్షలు నగదు,18,200 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారని, రీజినల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని, అలాగే సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని ఎన్‌ఐఎ గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఎన్‌ఐఎ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారని కనుగొంది. ఈ విధంగా శిక్షణ పొందిన వారి వల్లనే 2022 అక్టోబర్ 23న కోయంబత్తూరు కారు పేలుడు ప్రమాదం జరిగిందని ఎన్‌ఐఎ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News