Monday, December 23, 2024

శ్రీరామనవమి హింసాకాండపై ఎన్‌ఐఎ విచారణ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా, హుగ్లీ, దల్‌ఖోలాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్‌ఐఎ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ శుభేందు అధికారి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు సంబంధించిన అవసరమైన అన్ని పత్రాలను రెండు వారాల్లోగా జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేయాలని కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ పశ్చిమబెంగాల్ పోలీసులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News