Tuesday, November 5, 2024

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్థావరాలపై దాడులు కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి చెందిన రహస్య స్థావరాలపై ఎన్‌ఐఎ దాడులు చేసి ఈ నెల 6న ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో గురువారం దాడులు కొనసాగించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. హర్యానా లోని ఝజ్జర్,సోనిపట్ లోనూతనిఖీలు చేపట్టింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉగ్రవాద ముఠా నాయకుడు వికాస్ సింగ్‌కు చెందిన ఫ్లాట్, గోమతినగర్ ఎక్స్‌టెన్షన్, ఆస్తులను జప్తు చేసింది.

పంజాబ్ లోని ఫజిల్కా లోని బిషన్‌పురా గ్రామంలో నిందితుడు దలీప్ కుమార్ అలియాస్ భోలా అలియాస్‌దలీప్ బిష్ణోయ్‌కు చెందిన మరో రెండు ఆస్తులను అటాచ్ చేసింది. హర్యానా లోని యమునా నగర్‌కు చెందిన జోగిందర్ సింగ్ పేరుతో రిజిస్టర్ అయిన కారును స్వాధీనం చేసుకున్నారు. 2022 లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నేరాలపై ఎన్‌ఐఏ ఉపా యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ ముఠా దేశం లోని అనేక రాష్ట్రాల్లో మాఫియా తరహా క్రిమినల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని ఏజెన్సీ విచారణలో వెల్లడైంది. ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతోపాటు పలువురి హత్యలు, దోపిడీలకు పాల్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News