Wednesday, January 22, 2025

రాయదుర్గంలో ఎన్ఐఎ దాడులు…. ఉగ్రవాదులతో లింక్?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎస్‌ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్ధుల్ నివాసం ఉంటున్నాడు. అతడి కుమారుడు సోహెల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సోహెల్ ఎస్‌బిఐ ఎకౌంట్‌కు భారీ మొత్తంలో డబ్బు జమ కావడంతో ఎన్‌ఐఎ అధికారులకు అనుమానం వచ్చింది. అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. యువకుడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించి ఉగ్రవాదులతో సంబంధాలపై ఎన్‌ఐఎ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News