Monday, January 20, 2025

పండగల్లో హింసపై ఎన్‌ఐఎ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

NIA petition on Violence in SC

న్యూఢిల్లీ : శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దేశం లోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) తో దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టులో సోమవారం నాడు ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాది వినీత్ జిందాల్ ఈ పిటిషన్ వేశారు. ఊరేగింపుల్లో భక్తులపై కాల్పులు, రాళ్లు రువ్వడం , వాహనాలను ధ్వంసం చేయడం, మత ఉద్రిక్తతలు సృష్టించడం వంటివి దేశ సార్వభౌమత్వానికి ముప్పని ఆ పిటిషన్‌లో జిందాల్ పేర్కొన్నారు. ఏడు రాష్ట్రాల్లో వరుస దాడుల ఘటనలు ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని, దేశం లోని హిందువులను లక్షంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని, ఐఎస్‌ఐఎస్, ఇతర జాతి వ్యతిరేక, అంతర్జాతీయ సంస్థల ప్రమేయంతో అల్లర్లు సృష్టించేందుకు టెర్రర్ ఫండింగ్ జరుగుతోందనే అభిప్రాయాలకు తావిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News