Wednesday, January 22, 2025

ఖలిస్థాన్ ‘టైగర్‌ఫోర్స్’ స్థావరాలపై ఎన్‌ఐఎ దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలను రప్పించడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఉగ్ర గ్రూప్ ఖలీస్థాన్ టైగర్‌ఫోర్స్ (కెటిఎఫ్)కు చెందిన 10 స్థావరాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించింది. పంజాబ్ లోని తొమ్మిది చోట్ల, హర్యానా లో ఒక చోట ఈ దాడులు జరుగుతున్నాయి. ఇవే ఆరోపణలపై గత ఏడాది ఆగస్టు 20న పలువురిపై సుమోటోగా కేసులు నమోదు చేసింది.

మే 19న కెనడాకు చెందిన ఉగ్రవాది అర్ష్‌దల్లా సన్నిహితులు అమృత్‌పాల్ సింగ్,అమ్రిత్క్ సింగ్‌లను భారత్‌లో ప్రవేశించగానే అరెస్టు చేసింది. వీరిద్దరూ అర్ష్‌దల్లా తరఫున ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కార్యకలాపాలను భారత్‌లో విస్తరించడానికి పనిచేస్తున్నట్టు తేలింది. ఇదే సమయంలో మరోమోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి పనిచేస్తున్నట్టు గుర్తించారు. పాక్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్, ఉగ్రసంస్థల్లోకి యువతను ఆకర్షించడం వంటివి వీరు చేస్తున్నట్టు తేలింది. కేటీఎఫ్ కోసం బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని , ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, నిరాకరించిన వారి ఇళ్లు, ఇతర ఆస్తులను నిందితుల అనుచరులు దహనం చేస్తున్నారని ఎన్‌ఐఎ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News