Monday, January 20, 2025

బెంగళూరు, శివమొగ్గలో ఎన్‌ఐఎ దాడులు

- Advertisement -
- Advertisement -

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బెంగళూరు, శివమొగ్గతో సహా పలు ప్రదేశాలలో ఒకేసారి దాడులు నిర్వహించింది. ఈ నెల 1న రామేశ్వరం కేఫ్‌లో సంభవించిన ఐఇడి విస్ఫోటం సందర్భంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఆ పేలుడులో కనీసం పది మంది వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎన్‌ఐఎతో పాటు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) దర్యాప్తు ప్రారంభించింది.

అనుమానితునిఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ముందుగా వారిని తుమకూరుకు, ఆతరువాత బళ్లారికి దారి తీసింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) శివమొగ్గ మాడ్యూల్ నాయకుడు హ్యాండ్లర్ ముస్సావిర్ హుస్సేన్ షజీబ్ బాంబును అమర్చినట్లు, అహ్మద్ తాహా అనే మరొక ఐఎస్ నాయకుడు అతనికి సాయం చేసినట్లు దర్యాప్తు సిబ్బంది భావిస్తున్నారు. షజీబ్, తాహా జనవరి, ఫిబ్రవరి మధ్య బోగస్ గుర్తింపు పత్రాలతో దాదాపు ఒక నెల పాటు చెన్నైలో బస చేసినట్లు విశ్వసనీయ సమాచారం. షజీబ్ ధరించిన టోపీ చెన్నైలో ఒక మాల్‌లోనిఒక షాపులో కొన్నట్లు తేలిన తరువాత దర్యాప్తు సిబ్బంది అనుమానితుల పేర్లను గుర్తించగలిగారు.

పేలుడు తరువాత బెంగళూరులో బాంబర్ వదలివేసిన టోపీని తాహా జనవరి చివర్లో కొన్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఎ సమాచారం ప్రకారం, షజీబ్ నివాసం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి మసీదు రోడ్డులో కాగా తాహా తీర్థహళ్లి రూరల్ సొప్పు గూడెలోని చేపల మార్కెట్ రోడ్డులో ఉండేవాడు. ఆ ఇద్దరు అనుమానితులను ఎన్‌ఐఎ ‘పరారీలో ఉన్నవారిగా’ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News