Wednesday, January 22, 2025

రెండు జిల్లాల్లో ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌ఐఎ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో జాతీయ దర్యప్తు సంస్థకు చెందిన బలగాలు తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎ సోదాలు నిర్వహిం చింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కదలికల నేపథ్యంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కరీంనగర్ హుస్సేన్‌పురలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఎన్‌ఐఏ టీం సోదాలు చేపట్టింది. నిషేదిత పిఎఫ్‌ఐ సంస్థతో తబ్రేజ్‌కు సంబంధాలు ఉన్నట్లు సమాచా రం రావడంతో ఈ సోదాలు చేపట్టారు.

గురువారం తెల్లవారు జామున 3-.30గంటలకి తబ్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు దాదాపు 5గంటల పాటు సోదాలు నిర్వహించారు. తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. తబ్రేజ్ ఇంట్లో ఎన్‌ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడ ఎన్‌ఐఎఅధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని కరీంనగర్‌తో పాటు ఏపిలోని కర్నూలులోనూ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఎన్‌ఐఎ ప్రశ్నిస్తోంది. గతంలో కూడ పిఎఫ్‌ఐ కదలికలపై అనుమానాలతో ఎన్‌ఐఎ అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News