Saturday, December 28, 2024

తెలంగాణ, ఎపిలో ఎన్ఐఏ దాడులు

- Advertisement -
- Advertisement -

NIA raids in Telangana and Andhra Pradesh

హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ఉగ్రవాద సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం రాత్రి నుంచి దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్, భైంసా, ఏపీలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరులో సోదాలు కొనసాగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కేసులో ఎన్‌ఐఎ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అరెస్టయిన వారి ఇళ్లలో, అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తోంది. నిజామాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే అధికారులు దాడులు ప్రారంభించారు. ఇప్పటికే పీఎఫ్‌ఐ కన్వీనర్ షాదుల్లాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్‌ఐ పేరుతో ఓ సంస్థపై ఫిర్యాదులు అందడంతో ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News