- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. హైదరాబాద్, వరంగల్ తో పాటు ఏపీలోని తిరుపతి, గుంటూరు, నెల్లూరులో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అల్వాల్ లో అమర బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూష నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తున్నారు. గుంటూరులో డాక్టర్ రాజారావు, తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -