Saturday, November 23, 2024

మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

NIA search about training camp conducted by CPM in 2016

హైదరాబాద్: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది.

రాధ అదృశ్యంపై విశాఖ జిల్లాలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 2017 డిసెంబర్‌లో విశాఖ జిల్లా పెద్దబయలు పోలీస్ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలు ఉన్నాయి. నర్సింగ్ విద్యార్థిని రాధ మిస్సింగ్ కేసును ఎన్‌ఐఎకు అప్పగించారు. పెదబయలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఎ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మూడు సంవత్సరాల క్రితం తమ కూతురు రాధను కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సిఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని తల్లి ఆరోపణ చేసింది. సిఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని రాధ తల్లి పేర్కొంది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్ల నుంచి నర్సింగ్ విద్యార్థి రాధ ఇంటికి తిరిగి రావడం లేదు.

 

NIA Searches at Ex maoist houses in Telugu States

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News