Monday, January 20, 2025

ఎన్‌ఐఎ సోదాల కలకలం

- Advertisement -
- Advertisement -

NIA Raids multiple Locations in Telangana

ఎన్‌ఐఎ సోదాల కలకలం

మావోయిస్టు రిక్రూట్‌మెంట్ బృందం సభ్యులన్న అనుమానంతో ముగ్గురు మహిళల అరెస్టు

మనతెలంగాణ/హైదరాబాద్: పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం నాడు సోదాలు నిర్వహించింది. యువతను మావోయిస్టు పార్టీలో చేర్పించారన్న యోగాల మేరకు హైకోర్టు న్యాయవాది శిల్ప, ఎవోబి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్ భార్య దేవేంద్ర, స్వప్నలను ఎన్‌ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 2017లో నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసును ఎపి పోలీసులు విచారణ చేపట్టారు. రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, ఇందులో మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నేతల పాత్ర ఉందని గుర్తించిన ఎపి పో లీసులు ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగించారు. దీంతో రాధ మిస్సింగ్‌పై కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఎ అధికారులు విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పాటు మెదక్ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఉప్పల్‌లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో నాలుగు గం టలపాటు సోదాలు చేసిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.

అనంతరం న్యాయవాది శిల్పను మాదాపూర్‌లోని ఎన్‌ఐఎ కార్యాలయానికి తరలించి రాధ మిస్సింగ్ కేసుకు సంబంధించి విచారించారు. అదేవిధంగా న్యాయవాది శిల్పపై గ తంలో ఎల్‌బినగర్, ములుగు, గద్వాల, చెర్ల, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులపై ఆమెను ఎన్‌ఐఎ అధికారులు విచారించారు. అలాగే గతంలో ఎవోబిలో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ప్రభాకర్ భార్య, న్యాయవాది దేవేంద్ర నివాసంలోనూ సోదాలు చేసిన అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. దేవేంద్ర గతంలో చైత్యన్య మహిళా సంఘంలో కీలక హోదాలో పనిచేశారు. చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శం కర్ కుమారుడు శంకర్ నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టారు.అదేవిధంగా పర్వతపురంలోని అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
దేవేంద్ర, స్వప్న, శిల్పల అరెస్ట్ ః
దేవేంద్ర, స్వప్న, శిల్పలను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు జరిపింది. ఈక్రమంలో హైదరాబాద్ ఉప్పల్‌తో పాటు మెదక్ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లో ఎన్‌ఐఎ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో డిజిటల్ సామగ్రి, మావో భావజాల సామగ్రి స్వాధీనం చేసుకుంది. మావోయిస్టు అనుబంధ సంస్థతో దేవేంద్ర, స్వప్న, శిల్పకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. చైతన్య మహిళా సంఘం ఈ ముగ్గురూ పనిచేసినట్లు ఎన్‌ఐఎకు ఆధారాలు లభించాయి. యువత నక్సల్స్‌లో చేరేలా దేవేంద్ర, స్వప్న, శిల్పలు ప్రోత్సహించారని ఎన్‌ఐఎ తేల్చింది. ఎపిలోని వైజాగ్ పెదబయలులో ఈ ఏడాది జనవరి 3న ముగ్గురిపై కేసు నమోదు కాగా ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఎఐ దర్యాప్తు చేపడుతోంది.
విద్యార్థిని రాధ మిస్సింగ్ ః
ఎపిలోని వైజాగ్‌లో నర్సింగ్ విద్యార్థిని రాధ కిడ్నాప్ కేసును స్థానిక పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఈ ఘటనపై వైజాగ్‌లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేయడంతో పాటు మావోయిస్ట్ అనుభంద సంస్థ సిఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురును బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకున్నారని, ఇందుకు సిఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులు సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో 2017లో వైద్యం పేరుతో న్యాయవాది దేవేంద్ర తమ కూతురుని తీసుకెళ్లారని అప్పటి నుంచి ఇంటికి రాధ తిరిగి రాలేదని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసుల విచారణలో 2018 నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి ఉదయ్ అరుణతో కలిసి ఎవొబిలో రాధ పని చేస్తోందని తేలింది. దీంతో ఈ కేసు విచారణ చేపట్టిన ఎన్‌ఐఎ మావోయిస్ట్ అగ్ర నేతలు గాజర్ల రవి, దేవేంద్ర, శిల్ప, స్వప్న పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
నోటీసులు ఇవ్వకుండా తనికీలు ః
జాతీయ దర్యాప్తు సంస్థ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిపై సోదాలు చేశారని హైకోర్టు అడ్వకేట్ శిల్ప భర్త బండి కిరణ్ ఆరోపించారు. ఈక్రమంలో గురువారం ఆయన చిలకానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఐఏ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసి, తన భార్య శిల్పాను అదుపులోకి తీసుకున్నారన్నారు. మావోయిస్టులో చేరిన రాధ ఎవరో తమకు తెలియదన్నారు. మేము ఆమెను మావోయిస్ట్ పార్టీలోకి పంపినట్లు కేసు నమోదు చేశారని, అయితే మాకు, రాధకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిఎంఎస్ ఆర్గనైజేషన్‌లో ఎంతో మంది పని చేశారని, ఉద్దేశ పూర్వకంగా తమపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని బండి కిరణ్ పేర్కొన్నారు. గతంలో అర్బన్ మావోయిస్టు అని శిల్పను 6 నెలలు జైల్లో ఉంచారని కిరణ్ తెలిపారు.
మావోయిస్ట్ అగ్రనేత కుమారుడి ఇంట్లో:

మెదక్ జిల్లాలోని చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు. శంకర్‌పై గతంలో నమోదైన పలు కేసులకు సంబంధించి వివరాలు, కేసులకు సంబంధించిన ఆధారాల కోసం గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు తనిఖీ చేపట్టారు.

NIA Raids multiple Locations in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News