Saturday, November 16, 2024

తమిళనాడు, కశ్మీరులో నిషిద్ధ పిఎఫ్‌ఐ ఉగ్ర శిబిరాలపై ఎన్‌ఐఎ దాడులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు, తమిళనాడులోని షిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)కు చెందిన కేంద్రాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మంగళవారం దాడులు చేపట్టింది. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పన్నిన కుట్రలో భాగంగా యువతకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చేందుకు పిఎఫ్‌ఐకు చెందిన కేంద్రాలు శిక్షణా శిబిరాలను నడుపుతున్న ట్లు ఎన్‌ఐఎ అనుమానిస్తోంది.

తమిళనాడులోని చెన్నై, ముదరై, దిండిగల్, తేని, తిరువటియూర్, తిరుచ్చితోసహా 10 చోట్ల ఎన్‌ఐఎ దాడులు జరిపింది. నిషిద్ధ పిఎఫ్‌ఐకి చెందిన మదురై ప్రాంత అధ్యక్షుడు మొహమ్మద్ ఖాసియర్‌ను కూడా ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) కార్యాలయాలపై కూడా ఎన్‌ఐఎ దాడులు జరిపినట్లు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద శిక్షణకు నిధుల సమీకరణకు సంబంధించి జమ్మూ కశ్మీరులోని షోపియాన్, అనంత్‌నాగ్, బద్గామ్, బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, రాజౌరి జిల్లాలోసహా 15 ప్రదేశాలలో ఎన్‌ఐఎ దాడులు నిర్వహిసున్నట్లు వర్గాలు తెలిపాయి.

Also Read: డ్రైవర్‌కు గుండెపోటు… ఆర్‌టిసి బస్సును ఆస్పత్రికి తీసుకెళ్లాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News