- Advertisement -
న్యూఢిల్లీ : ప్రకటిత ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ( నియా ) సోమవారం తెలిపింది. కెనడాలో ఖలీస్థానీ వాదాన్ని రెచ్చగొడుతూ పన్నూ పలు స్థాయిల్లో హెచ్చరికలు వెలువరిస్తున్నారు. ఇటీవల పన్నూ పేరిట ఓ బెదిరింపు ప్రకటన వెలువడింది. ప్రయాణికులు ఎవ్వరూ ఎయిరిండియా విమానాలలో వెళ్లరాదని, వాటికి ముప్పు ఉంటుందని పన్నూన్ బెదిరించారు. దీనితో ఈ నెల 19వ తేదీనుంచి ఎయిరిండియా విమానాలు కెనడా ఇతర దేశాలకు నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని గుర్తించి పన్నూపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) ఐపిసిల పరిధిలో కేసు నమోదు చేశారు. నవంబర్ 4వ తేదీన పన్నూ ప్రకటన వెలువడింది. సిక్కులు ఎవరూ ఎయిరిండియా విమానాలలో ప్రయాణాలు పెట్టుకోవద్దని, వాటికి ముప్పు ఉంటుందని బెదిరించారు.
- Advertisement -