Saturday, November 23, 2024

రామేశ్వరం కేఫ్ పేలుడు అనుమానితుడి తాజా ఫోటోలు విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు కేసు అనుమానితుడికి సంబంధించిన తాజా ఫోటోలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శనివారం విడుదల చేసింది. అనుమానితుడికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తమను సంప్రదించాలని ఎన్‌ఐఎ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసుతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న యువకుడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల బహుమానం అందచేస్తామని మార్చి 6న ఎన్‌ఐఎ ప్రకటించింది. బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో కనీసం 10 మంది గాయపడ్డారు. ఐఇడి ద్వారా ఈ పేలుడు జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఈ కేసును ప్రాథమికంగా దర్యాప్తు చేసిన కర్నాటక పోలీసులు పేలుడుకు ఉప.యోగించిన టైమర్‌ను సవాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా&రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఎ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమాంతో అరెస్టు చేసిన నలుగురు నిందితులను జైలులో ప్రశ్నించింది. బెంగళూరులోని పరన్పన అగ్రహార జైలులో ఉన్న ముగ్గురు అనుమానితులను ప్రశ్నించేందుకు ఎన్‌ఐఎ కోర్టులో దరఖాస్తు చేసినట్లుఎన్‌ఐఎకి చెందిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. కోర్టు అనుమతితో జైలులో బళ్లారికి చెందిన సయ్యద్ సమీర్(19), ముంబైకి చెందిన అనస్ ఇక్బాల్ షేక్(23), ఢిల్లీకి చెందిన షాయన్ రహ్మాన్ అలియాస్ హుస్సేన్(26)ను ఎన్‌ఐఎ అధికారులు శుక్రవారం ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు.

అదే జైలులో ఉన్న బళ్లారికి చెందిన వస్త్ర వ్యాపారి మిన్హాజ్ అలియాస్ మొహమ్మద్ సులేమాన్(26)ను బుధవారం ఎన్‌ఐఎ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ నలుగురినీ ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు రాగా అవి నిజం కావని, వారిని జైలులోనే ఎన్‌ఐఎ ప్రశ్నించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్ర దాడులు నిర్వహించడానికి కుట్ర పన్నారన్న అనుమానంతో 2023 డిసెంబర్ 18న ఈ నలుగురితోపాటు మరో ఐదుగురు వ్యక్తులను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. ఐఇడిల తయారీ కోసం ముడి పేలుడు పదార్థాలను ఉపయోగించాలని వీరంతా కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఎ అనుమానిస్తోంది. ఈ ముఠాకు సులేమాన్ నాయకుడని ఎన్‌ఐఎ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News