Sunday, January 19, 2025

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఎ 17 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోనీ ఖైదీలకు లష్కరే ఉగ్రవాది నజీర్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు. ట్రైయినింగ్ తీసుకున్న ఖైదీల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేసింది. కర్నాటక, తమిళనాడుతో సహా మరో ఐదు రాష్ట్రాలలో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. 2023 జులైలో ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ ఐదుగురు లష్కరే తోయిబ ఉగ్రవాది నజీర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు తేలింది. వారి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో నజీర్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News