- Advertisement -
ఉగ్రవాదులకు, మాఫియాకు సంబంధాల కేసు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య సంబంధాలు ఉన్నాయన్న కేసులో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మంగళవారం సోదాలు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని 30 ప్రదేశాలలో ఎన్‌ఐఎ సోదాలు కొనసాగుతున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదులకు, మాఫియాకు మధ్య సంబంధాలను, వాటి మధ్య పరస్పర మౌలిక సదుపాయాల సహకారాన్ని విచ్ఛిన్నం చేయడంలో భాగంగా ఇటీవలి కాలంలో కొత్త వ్యూహాలకు ఎన్‌ఐఎ పదునుపెట్టింది. ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలకు ఎన్‌ఐఎ ఉపక్రమించింది. ఇందులో భాగంగానే తాజాగా భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది.
- Advertisement -