Monday, December 23, 2024

తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాల కలకలం

- Advertisement -
- Advertisement -

దేశ రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ గూఢచర్య సంస్థ సాయంతో లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ పాన్ ఇండియా లెవెల్‌లో సోదాలు నిర్వహించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, హర్యానాలోని మొత్తం 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. బుధవారం జరిపిన ఈ సోదాలపై గురువారం ఎన్‌ఐఎ ప్రకటన విడుదల చేసింది. ఈ తనిఖీల్లో 22 మొబైల్ ఫోన్లు, సెన్సిటివ్ సమాచారం కలిగిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారత నౌకా దళానికి చెందిన సున్నితమైన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు శత్రుదేశం పన్నిన కుట్ర 2021లో వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతంర 2023 నుంచి ఎన్‌ఐఎ ఈ కేసును విచారిస్తుండగా ఇప్పటికే పలు అనుబంధ చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.

2023 జులై 19న పరారీలో ఉన్న పాకిస్తాన్ కు చెందిన మీర్ బాలాజ్ ఖాన్ తో సహా ఇద్దరు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. మీర్ బాలాజ్ ఖాన్ అరెస్ట్ అయిన నిందితుడు ఆకాష్ సోలంకితో కలిసి గూఢచర్యం రాకెట్ లో పాల్గొన్నట్లు ఎన్‌ఐఎ దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత 2023 నవంబర్ 6న నమ్మోహన్ సురేంద్ర పాండా, అల్వెన్ అనే మరో ఇద్దరు నిందితులపై ఎన్‌ఐఎ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో పాండా అరెస్ట్ కాగా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అల్వెన్ పరారీలో ఉన్నాడు. మే 2024లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో కలిసి కుట్ర పన్నుతున్న మరో నిందితుడు అమన్ సలీం షేక్‌పై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News