Friday, November 22, 2024

ఉత్తరాది రాష్ట్రాలలో పట్టు కోసం నక్సల్స్ కసరత్తు

- Advertisement -
- Advertisement -

తన ఉనికికి మళ్లీ ప్రాణంపోసేందుకు నిషిద్ధ సిపి(మావోయిస్టు) చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేసే చర్యలలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శుక్రవారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్‌వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. వివిధ నిందితులు, అనుమానితులకు సంబంధించిన 9 ప్రదేశాలలో దాడులు నిర్వహించి సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఎ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో రెండేసి, ఢిల్లీలో ఒక ప్రదేశంలో సోదాలు జరిపినట్లు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌తోసహా కలుపుకుని నేషనల్ రీజినల్ బ్యూరో(ఎన్‌ఆర్‌బి)గా వ్యవహరించే ఈ రాష్ట్రాలలో మళ్లీ తన కార్యకలాపాలకు ఊపిరిపోయాలని తీవ్రవాద సంస్థ ఉధృతంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఐఎ తెలిపింది. ఈ దాడులలో అనేక లాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, కాంపాక్ట్ డిస్క్‌లు, హార్డ్ డ్రైవ్, మెమరీ కార్డులు, సిమ్ కార్డులు,

పాకెట్ డైరీలను నిందితులకు సన్నిహితులుగా భావిస్తున్న అనుమానితుల ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఎ పేర్కొంది. సిపిఐ(మావోయిస్టు) సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు అనుమానితులకు పూర్వ ఈస్టర్న్ రీజినల్ బ్యూరో(ఇఆర్‌బి) అధిపతి ప్రశాంత్ బోస్ నుంచి నిధులు అందుతున్నాయని తెఇపింది. ఉత్తరాది రాష్ట్రాలలో క్యాడర్‌ను రిక్యూట్ చేసి, సంస్థను బలోపేతం చేసేందుకు ఇఆర్‌బి నుంచి ముఖ్యంగా జార్ఖండ్ నుంచి అనుమానితులకు నిధులు లభిస్తున్నాయని తెలిపింది. భారత ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు, తమ సిద్ధాంతాలకు అనుగుణంగా హింసాత్మక తీవ్రవాద చర్యలకు పాల్పడేందుకు అండర్‌గ్రౌండ్ కేడర్‌గా పనిచేసే అనుకూలమైన వ్యక్తులను గుర్తించేందుకు అనేక అనుంబంధ సంస్థలు, విద్యార్థి విభాగాలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గుర్తించామని ఎన్‌ఐఎ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News