Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ శనివారం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. శనివారం ఉదయమే పాతబస్తీ, టోకీచౌకితోపాటు మరో మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. వివిధ మారు పేర్లతో సంస్థలు ఏర్పాటు చేసి ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్‌లో అనుమానితులు పనిచేస్తున్నాట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. యువతను ఐఎస్‌ఐఎస్ వైపు ఆకర్షించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఎన్‌ఐఏ తమిళనాడు, చెన్నైలోని మూడు ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 22చోట్ల సోదాలు నిర్వహించారు. తమిళనాడులో 30చోట్ల, కడియనల్లూరులో ఒక ప్రాంతంలో, హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. ఈ సోదాల్లో ఇద్దరిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ అధికారులు కీలక పాత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితోపాటు రూ.60లక్షలు, 18,200 అమెరికా డాలర్లు స్వాధీనం చేసుకుంది. నిందితులపై 120బి,121ఏ ఐపిసి, ప్రివేన్షన్ యాక్ట్ 13,18,18బి కింద కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో శిక్షణ…
ఇండియాకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్న నిందితులు అరబిక్ క్లాసుల పేరుతో యువతను సోషల్ మీడియాలో ఆకర్శిస్తున్నారు. దాని పేరుతో రిజినల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దానితోపాటు వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రత్యే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వీరు గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తెలిసింది. గత ఏడాది అక్టోబర్, 23న కోయంబత్తూరులో కారు బాంబు పేలుడుకు పాల్పడింది, ఈ తరహా శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులే నని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. దీని ద్వారానే ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుని వారితో దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ వేశారు. దీంతో తమిళనాడు, హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News