Sunday, January 19, 2025

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ మంగళవారం సోదాలు నిర్వహించింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఎపిలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు చేపట్టింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రామేశ్వరం పేలుడు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

సోహెల్ ఎస్‌బిఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం అతడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. తెలంగాణలోని వికారాబాద్‌లో వ్యాపారవేత్తను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. పూణె కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పలు నేరాలు చేసి శిక్షలు అనుభవిం చిన వ్యక్తిని ఎన్‌ఐఎ ప్రశ్నిస్తోంది. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం ఐదుగురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

గతంలోనూ సోదాలు
కాగా, గతంలోనూ ఎన్‌ఐఎ అధికారులు ఎపిలోని అనంతపురం పట్టణంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నా యనే ఆరోపణలపై కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా, రాయదుర్గంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News