Sunday, December 22, 2024

చంచల్‌గూడ జైలు నుంచి ఎన్‌ఐఎ కస్టడీలోకి నలుగురు పిఎఫ్‌ఐ సభ్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) కేసులో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శనివారం తన కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి జహీద్, సమీయుద్దీన్, మాజ్ హుస్సేన్, కలీం అనే నలుగురు నిందితులను ఎన్‌ఐఎ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

గత ఏడాది ఈ నలుగురితోపాటు మరికొందరిపై నమోదైన కేసుకు సంబంధించి వీరిని ప్రశ్నించడానికి ఎఎన్‌ఐఎ అధికారులు మాదాపూర్‌లోని తమ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ముస్లిం యువకులను తీవ్రవాదులుగా మార్చేందుకు వారికి శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలపై గత ఏడాది తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మందికిపైగా పిఎఫ్‌ఐ సభ్యులను ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు.

వీరిలో 11 మందిని నిదితులపై గత ఏడాది ఎన్‌ఐఎ చార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 16న మరో ఐదుగురు నిందితులపై ఎన్‌ఐఎ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టి వారిని తీవ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విక్షణా శిబిరాలలో వారికి ఆయుధాల శిక్షణ ఇస్తున్నట్లు ఐదుగురు పిఎఫ్‌ఐ సభ్యులపై తన చార్జిషీట్‌లో ఎన్‌ఐఎ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News