అమ్రావతి (మహారాష్ట్ర): మహారాష్ట్ర లోని అమ్రావతి కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు మంగళవారం తెలిపారు. అమ్రావతి కోర్టు ముందు వీరిని ఎన్‌ఐఎ హాజరు పరిచింది. నాలుగు రోజుల ట్రాన్సిస్ రిమాండ్ కు కోర్టు ఆదేశించింది. అరెస్టయిన వారిలో ముదసర్ అహ్మద్ (22), షారూక్ పథాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), యూసఫ్ ఖాన్ (32) తోపాటు హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షేఖ్ ఇర్ఫాన్‌షేఖ్ రహీమ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 8 లోగా ముంబై కోర్టులో వీరిని హాజరు పరిచే అవకాశాలున్నాయి. అమ్రావతిలో జూన్ 21 రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఉమేష్‌పై కత్తితో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన ఉమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఎన్‌ఐఏ కస్టడీలో కెమిస్ట్ హత్య కేసు నిందితులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -