Thursday, January 23, 2025

నికోలస్ పూరన్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టి20 క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కరీబియన్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడుతున్న పూరన్ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా బార్బడోస్ రాయల్స్ జరిగిన మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఇదే సమయంలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నయా రికార్డును నెలకొల్పాడు. పూరన్ ఈ ఏడాది 65 ఇన్నింగ్స్‌లలో 2059 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న 2,036 పరుగుల రికార్డును పూరన్ తిరగరాశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News