- Advertisement -
నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో దారుణం వెలుగలోకి వచ్చింది. విద్యార్థినిలను సోషల్ టీచర్ ఆంజనేయులు లైంగిక వేదింపులకు గురి చేశాడు. తనతో ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని 7వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. దీంతో స్కూల్ ముందు విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పి, వారి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడని మండిపడుతున్నారు. పాఠాలు బోధించి, అందులోని నీతిని వివరించి చెప్పాల్సిన గురువు గాడి తప్పాడని దుయ్యబట్టారు.
- Advertisement -