Monday, December 23, 2024

నల్లగొండలో ప్రేమించినందుకు చంపేశారు….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నిడమనూరు: వేటకోడవళ్లతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన  నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గుంటిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (24) అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. అమ్మాయి తరుపు వాళ్లు వీరి ప్రేమను అంగీకరించకుండా నవీన్‌ను పలు సార్లు మందలించారు. అయినప్పటికీ నవీన్ ప్రవర్తన మారకుండా మద్యం సేవించిన అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను గుంటిపల్లి గ్రామ శివారులో ఉన్నాను మీరు తన దగ్గరకు రండీ మాట్లాడుకుందామని చెప్పాడు.

దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంతో వేటకోడవళ్లను తీసుకొని వచ్చి గుంటిపల్లి గ్రామ శివారులో ఉన్న నవీన్‌ను దారుణంగా హత్య చేశారు. నవీన్‌తో కలిసి ఉన్న స్నేహితుడు స్వల్ప గాయాలతో పారిపోయాడు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ డిఎస్ పి వెంకటగిరి, హాలియా సిఐ గాందీనాయక్, ఎస్‌ఐలు శోభన్‌బాబు, క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News