Monday, December 23, 2024

నిధి అగర్వాల్ నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

Nidhi Agarwal plays negative role in 'Hari Hara Veera Mallu'
పవన్ కళ్యాణ్ సరసన అవకాశం రాగానే తన దశ మారిపోయిందని సంబరపడింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. కానీ కరోనా లాక్‌డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు ఇతర కారణాల వల్ల ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇంతవరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఆ సినిమా విడుదల కావాలంటే మరో ఆరు నెలలు ఆగాలి ఈ భామ. ‘హరి హర వీర మల్లు’ తర్వాత ఇతర పెద్ద సినిమాలు తన ఒడిలో వాలుతాయని భావించింది నిధి. అయితే ‘హరి హర వీరమల్లు’ వల్ల ఈ భామకి కెరీర్లో బాగా గ్యాప్ పెరిగిపోతోంది. ఈ ఏడాది ‘హీరో’ అనే సినిమాలో ఆమె కనిపించినా ఈ చిత్రం ఆమె కెరీర్‌కు ఏవిధంగానూ ఉపయోగపడలేదు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కోసమే ఆమె నిరీక్షిస్తోంది. మంచి గ్లామర్, ఫిజిక్‌తో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ భామకి రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో నటించాలని కోరిక. ‘హరి హర వీరమల్లు’ హిట్ అయి క్రేజ్ వస్తే ఆటోమేటిక్‌గా ఆ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఆమె తన అభిమానులతో టచ్‌లో ఉండేందుకు, ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లు అప్‌డేట్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News