‘హరిహర వీరమల్లు సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్షన్ కూడా బాగానే ఉంటుందట. ఇప్పుడు నిధి అగర్వాల్‌కి మరో క్రేజీ ఛాన్స్ దొరికిందట. తమిళ హీరో సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా? అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది.
ఈ క్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పారు. ఏ గెటప్‌లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు. ఈ సినిమా జూన్ నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందట. రెండో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత. అన్నట్టు ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సేను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర విషయానికి వస్తే.. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని, సినిమాలో ఆమెకి ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది.