Friday, December 20, 2024

భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..

- Advertisement -
- Advertisement -

22,000 దిగువన ముగిసిన నిఫ్టీ

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్ బాగా నిరాశపరిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌లో సెన్సెక్స్ 530 పాయింట్ల పైన కనిపించగా, ఇక నిఫ్టీలో 175 పాయింట్లకు పైగా పెరుగుదల కనిపించింది. అయితే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా లాభాల నుంచి భారీ నష్టాల్లోకి మార్కెట్లు పతనమయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 454 పాయింట్ల పతనంతో 72,489 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 152 పాయింట్ల పతనంతో 21,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22,000 దిగువకు పడిపోయింది.

రంగాల వారీగా చూస్తే అన్ని రంగాల స్టాక్‌లలో క్షీణత కనిపించింది. బ్యాంకింగ్, ఐటి, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో క్షీణత కనిపించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 4 లాభాలతో, 26 నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇన్వెస్టర్ల సంపద క్షీణించింది.

బిఎస్‌ఇ డేటా ప్రకారం, బిఎస్‌ఇ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 393.22 లక్షల కోట్లకు పడిపోయింది. అయితే గత సెషన్‌లో ఇది రూ. 394.32 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్క రోజు సెషన్‌లో మార్కెట్ విలువలో రూ.1.10 లక్షల కోట్ల క్షీణత కనిపించింది. స్టాక్స్ విషయానికొస్తే, ప్రధానంగా భారతీ ఎయిర్‌టెల్ 4.05 శాతం, ఎంసిఎక్స్ ఇండియా 3.88 శాతం, ఐసిఐసిఐ లాంబార్డ్ 3.73 శాతం, ఇండస్ టవర్స్ 3.35 శాతం పెరుగుదలతో ముగిశాయి. ఐజిఎల్ 5.49 శాతం, మహానగర్ గ్యాస్ 4.32 శాతం, ఒబెరాయ్ రియాల్టీ 4.21 శాతం పతనంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News