Sunday, December 22, 2024

మళ్లీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మళ్లీ నష్టాల్లో ముగిశాయి. నిన్నటి ట్రేడింగ్ లో కాస్త లాభాల్లోకి వచ్చినట్లే కనిపించినా నేడు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సూచీలే ఈ నష్టాలకు కారణమని తెలుస్తోంది.

ఊహించిన విధంగానే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో గురువారం నాడు సెన్సెక్స్ , నిఫ్టీలు అస్థిరమైన ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. నిరంతరంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన హాకిష్ వైఖరిని కొనసాగించింది.

నేడు సెన్సెక్స్ 581.79 పాయింట్లు లేక 0.73 శాతం నష్టపోయి 78886.22 వద్ద క్లోజ్ అయింది. కాగా నిప్టీ 180.50 పాయింట్లు లేక 0.74 శాతం నష్టపోయి 24117.00 వద్ద క్లోజయింది. నిఫ్టీలో టాటామోటార్స్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, సిప్లా, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ప్రధానంగా లాభపడగా, ఎల్ టిఐఎం, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, అప్పోలో హాస్పిటల్స్, ఇన్ఫీ ప్రధానంగా నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News