Sunday, September 8, 2024

ఫ్లాట్ గా ముగిసిన సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(గురువారం) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. రియాల్టీ, ఫార్మా రంగాల షేర్లు నష్టపోగా, ఐటి ఇండెక్స్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మదుపర్లు లాభాలను స్వీకరించడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో 600 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్ చివర్లో మళ్లీ కోలుకుంది.

చివరికి సెన్సెక్స్ 27.43 పాయింట్లు లేక 0.03 శాతం నష్టపోయి 79897.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 8.50 పాయింట్లు లేక 0.03 శాతం నష్టపోయి 24315.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో టాప్ గెయినర్లుగా ఇంజినీర్స్ ఇండియా, గుజరాత్ పిపావావ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, మాజగావ్ డాక్ నిలువగా, టాప్ లూజర్స్ గా ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్స్, 360 వన్ వామ్, గ్లెన్మార్క్ లైఫ్, బ్రిగేడ్ ఎంటర్పయిజర్స్ నిలిచాయి.  ఇక బంగారం ధర రూ.91.00 పెరిగి 72759.00 కు చేరింది. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.02 పాయింట్లు పెరిగి రూ. 83.56 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News