Thursday, September 19, 2024

స్టాక్ మార్కెట్లో భారీ పతనం…రూ.12 లక్షల కోట్లు ఆవిరి!

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్ అంచనా వేయడానికి ఉపయోగపడే బారోమీటరయిన  ‘విక్స్’(VIX) 22కు పెరిగింది. ఇది 2015 నుంచి ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి.  ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు కూడా 3శాతం పతనమయ్యాయి. మదుపరుల రూ. 17 లక్షల కోట్లు ఆవిరయిపోయాయి. ఇదో రకంగా సోమవారం అల్లకల్లోలం(Monday Mayhem) అనొచ్చు. అమెరికాలో మాంద్యం ఛాయలు పొడసూపడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అధోముఖం పట్టాయి. మధ్యాహ్నం 11.20 కు సెన్సెక్స్ 2.83 శాతం పతనమై 78693 వద్ద, నిఫ్టీ 2.8 శాతం పతనమై 24025 వద్ద ట్రేడయ్యాయి. దాదాపు 3007 షేర్లు పతనం కాగా, 437 షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఇక 82 షేర్లు మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.

అమెరికా సూచీ నాస్ డాక్ ఫ్యూచర్స్ 2శాతం పతనం కాగా,  నిక్కీ 13 శాతం మేరకు పతనమైంది. ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లు కరెక్టివ్ ఫేస్ లోకి ప్రవేశించాయనిపిస్తోంది.  కంపెనీల రిజల్ట్స్, బడ్జెట్ ప్రకటన, ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు మార్కెట్ పై ప్రభావం చూపాయనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి, కరెక్షన్ కు మార్గం సుగమం చేశాయి.

ఇండియా విక్స్(vix) ను మార్కెట్ యాంగ్జయిటీ బారోమీటర్ అని కూడా అంటారు. అది దాదాపు 52 శాతం లేక 22 పాయింట్ల మేరకు పెరిగింది. ఇంది 2015 నుంచి అత్యధిక గణన అనే చెప్పాలి. విక్స్ పెరిగిందంటేనే మార్కెట్ పతనం అని అర్థం చేసుకోవాలి. నిఫ్టీ ఆటో, రియాల్టీ, మెటల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ సూచీలు 3 శాతం మేరకు పతనమయ్యాయి. కాగా నిప్టీలో హిందుస్థాన్ యూనీలీవర్, టాటా కన్జూమర్ ప్రొడక్ఠ్స్, సన్ ఫార్మా, నెస్లే, బ్రిటానియా లాభపడగా, టాటామోటార్స్, ఓఎన్ జిసి, హిందాల్కో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ షేర్టు నష్టపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News