Monday, December 23, 2024

నిఫ్టీ మళ్లీ 16,000 మార్క్ పైకి చేరుకుంది

- Advertisement -
- Advertisement -

Market zooms

ముంబై: ఆటో, క్యాపిటల్ గూడ్స్ , ఎఫ్ఎంసిజి పేర్లలో కొనుగోళ్ల మద్దతుతో జూలై 15న అత్యంత అస్థిరమైన సెషన్‌లో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు నాలుగు రోజుల నష్టాల పరంపరను తుడిచేసి లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 344.63 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 53,760.78 వద్ద, నిఫ్టీ 110.50 పాయింట్లు లేదా 0.69 శాతం పెరిగి 16,049.20 వద్ద ముగిశాయి. ఈ వారంలో నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ 1 శాతం చొప్పున నష్టపోయాయి.

మార్కెట్ మొదట లాభాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత సెషన్లో సైడ్వేస్లో నడిచింది.  అయితే, ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రోజువారీ గరిష్ట స్థాయిలో ముగిశాయి. అస్థిరత(వోలాటిలిటీ) మళ్లీ ఉద్భవించింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్,  హెచ్‌యుఎల్ టాప్ గెయినర్స్‌గా నిలువగా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో , జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News