Monday, December 23, 2024

16,600 దిగువన ముగిసిన నిఫ్టీ !

- Advertisement -
- Advertisement -

 

Nifty

ముంబై: బెంచ్‌మార్క్ సూచీలు అస్థిర సెషన్‌ల మధ్య మధ్యస్తంగా కదలాడి తక్కువలో ముగిశాయి, అయితే ఎక్కువ వరకు  అమ్మకాల ఒత్తిడిలో కొనసాగింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించి 49 పాయింట్ల నష్టంతో 55,769.23 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 16,584 వద్ద ముగిసింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100,  స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 1.6 శాతం మరియు 0.86 శాతం మేరకు పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో పెరుగుతున్న ప్రతి షేరుకు దాదాపు రెండు షేర్లు క్షీణించాయి.

అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఎన్‌టిపిసి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం కూడా లాభాలలో కొనసాగింది. కాగా ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్,  సన్ ఫార్మా తరువాతి స్థానాల్లో లాభపడ్డాయి.

ఏథర్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్‌ఛేంజీలో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ. 642తో పోలిస్తే 10 శాతం లాభంతో రూ. 706.15 వద్ద లిస్టయ్యాయి. తర్వాత 20.62 శాతం పెరిగి 774.40 వద్ద అప్పర్ సర్క్యూట్ ను  తాకాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News