Saturday, December 21, 2024

16000 మార్కును దాటిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -
Sensex
Sensex
ఆర్థిక, ఎఫ్‌ఎంసిజి షేర్లు లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1% మేరకు పుంజుకున్నాయి
400 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్

ముంబై: అనేక రోజుల ఒడుదుడుకుల తర్వాత స్టాక్ మార్కెట్ నేడు లాభాల్లో(గ్రీన్‌లో) వరుసగా రెండో రోజు కూడా ముగిసింది. నిఫ్టీ50 బెంచి మార్కు 16000 మార్కును దాటింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క షేరు నష్టపోతే మూడు షేర్లు చొప్పున లాభపడ్డాయి. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఈ సెన్సెక్స్ 427.49 పాయింట్లు లేక 0.80 శాతం లాభపడి 54178.46 వద్ద ముగియగా, నిఫ్టీ 50 బెంచిమార్క్ 143.10 పాయింట్లు లేక 0.89 శాతం లాభపడి 16132.90 వద్ద ముగిసింది.

ఫెడ్ మినట్స్ గురువారం విడుదల కావడంతో గ్లోబల్ మార్కెట్లు బలంగా ట్రేడయ్యాయి. దక్షిణకొరియాకు చెందిన కోస్పీ లీడింగ్ గెయినర్‌గా నిలబడింది. దాదాపు 1.8 శాతం లాభపడింది. దాని తర్వాత జపాన్‌కు చెందిన నిక్కీ 1.5 శాతం మేరకు లాభపడింది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఒక్కో శాతం మేరకు లాభపడ్డాయి. యూరొపియన్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టిఎస్‌ఈ, ఫ్రాన్స్‌కు చెందిన సిఎసి ఒక శాతంకు మించి లాభపడ్డాయి. కాగా జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 1.5 శాతంకు పైగా లాభపడింది.

భారత రిజర్వు బ్యాంకు విదేశీ పెట్టుబడులను(ఫారిన్ ఫ్లోస్) ఆకర్షించేందుకు అనేక చర్యలను ప్రకటించింది. అన్ని రంగాల షేర్లు పుంజుకున్నాయనే చెప్పాలి. నిఫ్టీ బ్యాంక్ 1.7 శాతం మేరకు, రియాల్టీ 2.6 శాతం మేరకు, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.6 శాతం మేరకు, మెటల్స్ 3.8 శాతం మేరకు బిగ్గెస్ట్ గెయినర్లుగా నిలిచాయి. ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతంకు మించి లాభపడ్డాయి. కాగా ఐటి, ఫార్మా సూచీలు 0.5 శాతం మేరకు లాభపడ్డాయి. ఓలాటిలిటీ కాస్త నెమ్మదించింది. 20 మార్కు కన్నా తగ్గింది. దాంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ మళ్లీ పుంజుకున్నారనే అనిపిస్తోంది. ఒకవేళ మార్కెట్ 20 మార్కు కన్నా తక్కువలో స్థిరపడితే మార్కెట్‌లో నిలకడ(స్టెబిలిటీ) వచ్చినట్లే. ఇండియా విక్స్‌ను సాధారణంగా మార్కెట్ ఓలాటిలిటీని గణించేందుకు చూస్తుంటారు. అది నేడు(గురువారం) మైనస్ 5.25 శాతం లేక 19.20 మార్కుకు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News