Thursday, January 23, 2025

వరుసగా 11వ రోజు లాభాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 67,774 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 20,173 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ స్టాక్స్‌లో హెచ్‌సిఎల్ టెక్, టాటా మోటార్స్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్, హిందుస్తాన్ యునిలివర్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్‌లు నష్టాలను చవిచూశాయి. ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్ సానుకూలంగా ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) గురువారం నికర కొనుగోలుదారులుగా మారగా, దాదాపు రూ.294.69 కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News