ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నిఫ్టీ 20 వేల మార్క్‌కు చేరువ అవుతోంది. నిఫ్టీ 19,991 స్థాయిని తాకింది. ఆఖరికి నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 19,979 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 67,571 వద్ద స్థిరపడింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 22 లాభపడగా, 8 క్షీణించాయి. వరుసగా ఆరో రోజు కూడా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్‌ల సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు ఐటి, టెక్, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు క్షీణించాయి. ఇన్ఫోసిస్ నికర లాభం 11 శాతం పెరిగింది. రిలయన్స్ ఆర్థిక సేవల వ్యాపారం ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్’ దాని మాతృ సంస్థ నుండి వేరు అయింది. విభజన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ధరను ప్రైస్ డిస్కవరీ మెకానిజం కింద రూ. 261.85గా నిర్ణయించారు. ఇంతకు ముందు జూలై