Friday, November 22, 2024

భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం చివరి రోజైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచి రోజంతా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్ సూచీలను దెబ్బతీశాయి. అమెరికాలో ప్యాక్‌వెస్ బ్యాంక్ కార్ప్ సైతం పతనం అంచుకు చేరుకుందన్న వార్త మదుపరులపై ప్రభావం చూపింది. ఇందిలావుండగా ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

సెన్సెక్స్ 694.96 పాయింట్లు లేక 1.13 శాతం పతనం అయి 61054.29 వద్ద ముగిసింది, కాగా నిఫ్టీ 186.80 పాయింట్లు లేక 1.02 శాతం పతనమై 18069.00 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, నెస్లే ఇండియా, ఐటిసి, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టి, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్ షేర్లు లాభపడగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌లో దాదాపు 1499 షేర్లు లాభపడగా, 2015 షేర్లు నష్టపోయాయి, 127 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా తటస్థంగా ఉండిపోయాయి. రెండు నెలల వ్యవధిలో బిగ్గెస్ట్ సింగిల్ డే పతనంను మార్కెట్లు చూశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News