Thursday, January 23, 2025

రికార్డు స్థాయిలను తాకాక చివరికి స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆగస్టు 1న కొత్త రికార్డు స్థాయిలను(సెన్సెక్స్ 82129.49, నిఫ్టీ 25000ని తొలిసారి అధిగమించింది) తాకాక భారతీయ దేశీ స్టాక్ మార్కెట్లు ఉదయం సాధించిన లాభాలను క్రమంగా వదులుకున్నాయి. కాకపోతే స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 126.21 పాయింట్లు లేక 0.15 శాతం పెరిగి 81867.55 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 59.75 పాయింట్లు లేక 0.24 శాతం పెరిగి 25010.90 వద్ద ముగిసింది.

నిఫ్టీ 500 లో అదానీ ట్రాన్స్మిషన్, జూబిలెంట్ లైఫ్, ఫస్ట్ సోర్స్, క్యాప్రీ గ్లోబల్ లాభపడగా, సొనాటా సాఫ్ట్ వేర్, కె ఆర్ బిఎల్, ఏజిస్ లాగిస్టిక్స్, బిర్లా సాఫ్ట్ ప్రధానంగా నష్టపోయాయి.  బంగారం ధర రూ. 270.00 లేక 0.39 శాతం పెరిగి రూ. 69282.00 వద్ద ట్రేడయింది. కాగా అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.01 పైసలు లేక 0.01 శాతం పతనమై రూ. 83.72 వద్ద ట్రేడయింది.

మైనింగ్ స్టాకులు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కోల్ ఇండియా (+3.49%),సందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్ లిమిటెడ్(3.01%), లెక్సాస్ గ్రానిటో(ఇండియా) లిమిటెడ్(2.32%), ఎన్ఎండిసి(0.47%), మాధవ్ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ లిమిటెడ్(0.11%) టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News