Monday, January 20, 2025

52 వారాల గరిష్ఠాన్ని అధిగమించిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: వారాంతం దేశీయ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లేక 1.95 శాతం పెరిగి 61795.04 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ50 కూడా 321.50 పాయింట్లు లేక 1.78 శాతం మేరకు పెరిగి 18349.70 వద్ద ముగిసింది. అమెరికా ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెల కూడా తగ్గి 7.7 శాతంగా నమోదయింది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రపంచవ్యాప్త మార్కెట్లలో ఓ జోష్‌ని నింపింది. ఎస్ అండ్ పి 500 ఏకంగా 5.54 శాతం మేరకు పెరిగింది. నాస్‌డాక్ 7.35 శాతం పుంజుకుంది. డోజోన్స్ 3.70 శాతం రాణించింది.

అమెరికా మార్కెట్ సంకేతాలు అందుకున్నాక ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా లాభపడ్డాయి. ప్రస్తుతం ఐరోపా మార్కెట్‌లో కూడా ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడంతో నాలుగేళ్ల గరిష్ఠానికి రూపాయి లాభపడింది. డాలరుతో పోల్చినప్పుడు ఇదివరకు 81.81 ఉన్న రూపాయి విలువ నేడు 80.81కు చేరుకుంది. అంటే 100 పైసలు పెరిగింది. 2018 డిసెంబర్ 18 నుంచి ఇంతలా పెరగడం ఇప్పుడే. ఆర్థిక మాంద్యం భయాలు తగ్గడంతో ఐటి స్టాకులు పుంజుకున్నాయి. నిఫ్టీ50 అయితే 52 గరిష్టంకు 18350.95కు చేరింది.

హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్ లాభపడగా;  ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ, కొటక్ మహీంద్ర బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి షేర్లు నష్టపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News