Saturday, December 21, 2024

16,600 పైన ముగిసిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

Sensex lost 715 points

ముంబై: బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా ఐదో రోజు  లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 284.42 పాయింట్లు లేదా 0.51% పెరిగి 55,681.95 వద్ద,  నిఫ్టీ 84.50 పాయింట్లు లేదా 0.51% పెరిగి 16,605.30 వద్ద ఉన్నాయి. దాదాపు 1950 షేర్లు లాభపడగా, 1302 షేర్లు క్షీణించాయి,  155 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీకి తక్షణ మద్దతు ఇప్పుడు 16480కి పెరిగింది, అది ఛేందించితే, ఇండెక్స్ ధరల వారీగా కరెక్షన్‌ను చూడవచ్చు. మరోవైపు ఇండెక్స్‌కు నిరోధం(రెసిస్టెన్స్) 16650 వద్ద కనిపిస్తోంది.  ఇదో ముఖ్యమైన రీట్రేస్‌మెంట్ స్థాయి,  దాని  తదుపరి స్థాయి ఇదివరకటి జూన్ ప్రారంభంలో ఉండిన 16790 గరిష్ట స్థాయి కాగలదు.

ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యుపిఎల్ , బజాజ్ ఫిన్‌సర్వ్ నిఫ్టీలో టాప్ గెయినర్స్‌ కాగా, నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా , టెక్ మహీంద్రా ఉన్నాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో-  ఫార్మా మినహా, అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి, పిఎస్‌యు బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ , క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం ఎగబాకాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లాభాలను  కొనసాగించింది.  35,800 వద్ద బలమైన మద్దతు(స్ట్రాంగ్ సపోర్ట్)  బయ్-ఆన్-డిప్ మోడ్‌లో ఉంది. దాని తక్షణ  నిరోధం(అప్‌సైడ్ రెసిస్టెన్స్)  36,500 వద్ద ఉండగా… ఇంకా పైకి 37,000 స్థాయికి వెళ్లడానికి అవకాశం ఉంది.  సాంకేతికంగా  రోజువారీ చార్టు చూసినట్లయితే  నిఫ్టీ  బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పరుచుకుంది , 100-రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ (SMA) కంటే పైన  ముగిసింది.  ఇది స్థూలంగా చూసినట్లయితే పాజిటివ్ గా ఉంది. గత కొన్ని సెషన్లలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లలోకి ఎఫ్‌ఐఐలు తిరిగి రావడంతోపాటు కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, యూఎస్ ఫెడ్ తదుపరి సమావేశంలో దూకుడుగా రేట్ల పెంపుదలకు వెళ్లకపోవచ్చనే ఆశలు పెట్టుబడిదారుల భయాలను కొంత మేరకు తగ్గించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News