- Advertisement -
514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
రెండు రోజుల మార్కెట్ నష్టాలకు చెక్
ముంబయి: ఒక్క ఆటో, పవర్ సెక్టార్లు తప్పించి మిగిలిన అన్ని సెక్టార్ల షేర్లు మంగళవారం లాభపడ్డాయి. రియాల్టీ, ఐటి, మెటల్ షేర్లు 2-3 శాతం కన్నా ఎక్కువే లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 165.10 పాయింట్లు లాభపడి 17562.00 వద్ద, సెన్సెక్స్ 514.34 పాయింట్లు లాభపడి 59005.27 వద్ద ముగిసింది.
భారత స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్మార్ట్ రికవరీని చూశాయి. కోవిడ్ భయం తగ్గడం, ఆర్థికవ్యవస్థ మెరుగుపడ్డం వల్ల ఈ రికవరీ సాధ్యమైందని భావిస్తున్నారు. విదేశీ మదుపరులు సైతం భారత మార్కెట్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారు. నిఫ్టీ పుట్ కాల్ నిష్పత్తి సైతం 0.98 స్థాయికి పడిపోయింది. దానిని ఓవర్‌సోల్డ్ ప్రాంతంగా భావిస్తారు. దాంతో భారత్ స్టాక్ మార్కెట్లో షార్ట్-రికవరీ ర్యాలీ జరిగింది. ఎఫ్‌ఒఎంసి సమావేశం జరగనున్న నేపథ్యంలో వోలాటిలిటీ కొనసాగనున్నదని తెలుస్తోంది. డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మూమెంట్ మెరుగుపడుతున్న సంకేతాలను ఇస్తోంది. మంగళవారం అత్యధికంగా లాభపడింది జెఎస్‌డబ్లు స్టీల్ కాగా(+ 5.65 శాతం), అత్యధికంగా నష్టపోయింది మారుతి సుజుకీ (-2.49 శాతం). బెస్ట్ సెక్టార్ మెటల్ కాగా, వర్‌స్ట్ సెక్టార్ ఆటో(-0.46 శాతం).
లాభపడిన షేర్లలో పివిఆర్, జెఎస్‌డబ్లు, మైండ్ ట్రీ, ఒఎన్‌జిసి, సెయిల్ ఉండగా, నష్టపోయిన షేర్లలో ఇండియాబుల్స్ హౌజింగ్, పాలీక్యాబ్, మారుతి సుజుకీ, ఐఆర్‌సిటిసి, టివిఎస్ మోటార్ ఉన్నాయి.
- Advertisement -