Saturday, November 23, 2024

పాజిటివ్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్

- Advertisement -
- Advertisement -

BSE ended in green
ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్‌లో శుక్రవారం ఆరంభంలో కనిపించిన ఇంట్రాడే లాభాలు మార్కెట్ ముగిసే సమయానికి తరిగిపోయాయి. అయితే దేశీయ మార్కెట్ సూచీలు చివరికి పాజిటివ్‌గానే ముగిసాయి. బాంబే స్టాక్ మార్కెట్ బెంచిమార్క్ అయిన సెనెక్స్ తొలిసారి 60000దాటింది.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 163.11 పాయింట్లు లేక 0.27శాతం లాభపడి 60048.47 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30.25 పాయింట్లు లేక 0.17శాతం లాభపడి 17853.20 వద్ద ముగిసింది. దాదాపు 1286 షేర్లు లాభాల్లో, 1894 షేర్లు నష్టాల్లో ముగిసాయి. కాగా 152 షేర్లు హెచ్చుతగ్గులు లేకుండా ముగిసాయి. నిఫ్టీలో లాభపడిన షేర్లలో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉండగా, నష్టపోయిన షేర్లలో టాటాస్టీల్, జెఎస్‌డబ్లు స్టీల్, ఎస్‌బిఐ, దివీస్‌ల్యాబ్స్, యాక్సిస్‌బ్యాంక్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ 1 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.3 శాతం పతనం అయ్యాయి. ఐటి, ఆటో, రియాల్టీ షేర్లు తప్పించి ఇతర అన్ని సెక్టార్లలోని షేర్లు నష్టాల్లో ముగిసాయి. మెటల్, ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్, పవర్ సూచీలు 1 నుంచి 2 శాతం వరకు నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News